మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి | Director Rajamouli Urges People Not Take Army Videos | Sakshi
Sakshi News home page

SS Rajamouli: భారత ఆర్మీ ఫొటోలు, వీడియోలు తీయొద్దు

May 9 2025 4:14 PM | Updated on May 9 2025 4:20 PM

Director Rajamouli Urges People Not Take Army Videos

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో భారత ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. కానీ సోషల్ మీడియాలో లెక్కకు మించి ఫేక్ వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ప్రజలకు తనవంతు బాధ్యతగా ఓ సూచన చేశారు.

(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) 

'పాజిటివ్, అప్రమత్తంగా ఉంటే విజయం మనదే. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సాయుధ దళాలని మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ భారత సైనిక చర్యలని మీరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీరు శత్రువలకు సాయం చేసినవాళ్లు అవుతారు. అనధికారిక ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

మొన్నటివరకు రాజమౌళి.. మహేశ్ బాబుతో సినిమా షూటింగ్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి జూన్ లో ప్రారంభించనున్నారు. అప్పటిలోపు పరిస్థితులు సద్దుమణిగితే సరేసరి. లేదంటే సినిమాల షూటింగ్స్ కూడా వాయిదా పడొచ్చేమో? ఇకపోతే రాజమౌళి.. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్ గా ఆపరేషన్ సిందూర్ అని రాసి ఉన్న ఫొటోని పెట్టుకున్నారు.

(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement