
ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. మన సైనికులకు అండగా ఉంటానని మాటిచ్చారు. తన లేటెస్ట్ మూవీ వసూళ్ల నుంచి వచ్చే లాభాల్లో కొంత భాగం మన సైనికులకు విరాళంగా ఇస్తానని మాటిచ్చారు.
(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి)
చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అల్లు అరవింద్.. గతంతో పోలిస్తే సినిమాలు తీయడం బాగా తగ్గించేశారు. కొన్ని చిన్న చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అలా తీసిన లేటెస్ట్ మూవీ '#సింగిల్'. శ్రీ విష్ణు, కేతిక, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది.
సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సందర్భంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాను భారత ఆర్మీకి అండగా ఉంటానని, సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతమేర ఆర్థిక సాయం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈయనలానే మిగతా దర్శక నిర్మాతలు హీరోహీరోయిన్లు కూడా సాయం చేసి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరుకుందాం.
(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్)