
ఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదని స్పష్టం చేసింది. ఈ రోజు డీజీఎంవో చర్చలు లేవని తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది.
పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం విలవిల్లాడింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ (Pakistan)శరణుగోరింది. పాక్ అర్జించడంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) స్థాయిలో కాల్పుల విరమణ అవగాహనపై ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
Some media houses are reporting that the ceasefire between India and Pakistan is ending today. In addition, queries are also being received if a DGMO-level talk is scheduled today.
According to the Indian Army, no DGMO talks are scheduled today. As far as the continuation of a…— ANI (@ANI) May 18, 2025