
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు.
పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ బలగాలు జరిపిన దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరోసారి పహల్గాం తరహా ఘటన పునరావృతం కాకుండా ఉండేలా పాకిస్తాన్‌కు గట్టి గుణ పాఠం చెప్పాలి. పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి. జై హింద్! అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
میں ہماری دفاعی افواج کی جانب سے پاکستان میں دہشت گرد ٹھکانوں پر کیے گئے ہدفی حملوں کا خیرمقدم کرتا ہوں۔ پاکستانی ڈیپ اسٹیٹ کو ایسا سبق سکھانا چاہیے کہ پھر کبھی دوسرا پہلگام نہ ہو۔ پاکستان کے دہشت گردی کے ڈھانچے کو تباہ کر دینا چاہیے۔ جے ہند!#OperationSindoor
— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025