పాక్‌ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్‌ సైన్యం కాల్పులు | Pakistan Firing At International Border After Ceasefire Violations Along LoC, Watch Video Inside | Sakshi
Sakshi News home page

పాక్‌ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్‌ సైన్యం కాల్పులు

Apr 30 2025 11:16 AM | Updated on Apr 30 2025 1:01 PM

Pakistan Firing At International Border

జమ్మూ : భారత్‌  ఓ వైపు సైనిక చర్యకు  సిద్ధమైందని, ఆ పని చేయొద్దంటూ ఐక్య రాజ్య సమితిని పాకిస్తాన్‌ బతిమలాడుతోంది. అదే సమయంలో  భారత్‌ను రెచ్చగొట్టేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యధేశ్చగా కాల్పులకు తెగబడుతుంది. 

తాజాగా, మంగళవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్, పరగ్‌వాల్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు జరిపింది.  పాక్‌ కాల్పులపై భారత సైన్యం స్పందించింది. 

జమ్మూ ప్రాంతంలోని మూడు ప్రధాన సెక్టార్లలో కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. వరుసగా ఆరో రోజు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అంతే ధీటుగా భారత సైన్యం బదులిస్తోందని భద్రతా బలగాలు తెలిపాయి.  

  ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రవాదులు 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారు. నాటి నుంచి భారత్‌-పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సైనిక దుస్తులు ధరించిన అమాయకుల ప్రాణాల్ని తీయడంపై భారత్‌.. పాక్‌ను అన్నీ అంశాల్లో దెబ్బకు దెబ్బతీయాలనే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.

ఇందులో భాగంగా  ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 27 నుండి పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేసింది. అటారీ బోర్డర్‌ను తక్షణమే మూసివేసింది.

Advertisement
 
Advertisement
Advertisement