మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్‌ ఆర్మీ వార్నింగ్‌ | Director General Of Military Operations Press Meet Over Operation Sindoor | Sakshi
Sakshi News home page

మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్‌ ఆర్మీ వార్నింగ్‌

May 11 2025 6:39 PM | Updated on May 11 2025 9:57 PM

Director General Of Military Operations Press Meet Over Operation Sindoor

ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు  త్రివిధ దళాల  డీజీఎంవోలు (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌) మీడియా సమావేశంలో వెల్లడించారు.     

  • ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించాం
  • ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్‌ చేశాం
  • ఉగ్రవాద ట్రైనింగ్‌ సెంటర్లను ముందే గుర్తించాం
  • దాడికి ముందే ట్రైనింగ్‌ సెంటర్లను ఖాళీ చేశారు
  • మురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్‌ క్యాంపులను తొలిసారి నాశనం చేశాం
  • అజ్మల్‌ కసబ్‌,డేవిడ్‌ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్‌ తీసుకున్నారు
  • 9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం
  • 100 మంది ఉగ్రవాదులు ఎయిర్‌ స్ట్రైక్‌లో హతమయ్యారు
  • మేం ఎయిర్‌ స్ట్రైక్‌ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్‌ కాల్పులు జరిపింది
  • ఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాం
  • పాకిస్తాన్‌ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్‌ చేసింది.
  • ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్‌ చేశాం
  • లాహోర్‌ నుంచి డ్రోన్‌,యూఏవీలతో భారత ఎయిర్‌ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్‌ చేసింది.
  • గైడెడ్‌ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాం
  • లాహోర్‌లో ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టంను నాశనం చేశాం  
  • లాహోర్‌ నుంచి డ్రోన్‌,యూఏవీలతో భారత ఎయిర్‌ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్‌ చేసింది.
  • గైడెడ్‌ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాం
  • లాహోర్‌లో ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టంను నాశనం చేశాం
  • ఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్‌ నుంచి నలియా వరకు డ్రోన్‌లతో దాడులు చేసింది
  • ఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు  

 

మరోసారి ​కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టం

  • నిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్‌ డీజీఎంవో మాకు ఫోన్‌ చేశారు
  • కాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్‌ ప్రాధేయ పడింది
  • విరమణకు అంగీకరించాం
  • కాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్‌ కాల్పులకు విమరణకు పాల్పడింది
  • కాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్‌ మెసేజ్‌ పంపాం
  • ఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్‌ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉంది
  • మరోసారి కాల్పులు జరిపితే పాక్‌ అంతు చూస్తాం
  • పాక్‌ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులు
  • ఆపరేషన్‌ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారు
  • భారత సైనికుల త్యాగం వృధా కాదు
  • ఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్‌ చేస్తున్నాం​

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement