బోర్డర్‌కు అదనంగా భారత సైన్యం.. ఆర్మీ ప్లానేంటి? | BSF to get 16 new battalions India Pakistan Border | Sakshi
Sakshi News home page

బోర్డర్‌కు అదనంగా భారత సైన్యం.. ఆర్మీ ప్లానేంటి?

May 5 2025 7:58 AM | Updated on May 5 2025 8:56 AM

BSF to get 16 new battalions India Pakistan Border

శ్రీనగర్‌: భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పాక్‌ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. నియంత్రణ రేఖ వెంబడి 11వ రోజు మరోసారి కాల్పులు జరిపింది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, మెంధార్‌, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్‌ ప్రాంతాల్లో పాక్‌ ఆర్మీ కాల్పులకు తెగబడింది. దీంతో, వెంటనే భారత భద్రతా బలగాలు అప్రమత్తమై పాక్‌ ఆర్మీ ప్లాన్‌ను తిప్పికొట్టాయి.

మరోవైపు.. సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించింది. కొత్తగా 16 అదనపు బెటాలియన్లు రంగంలోకి దిగాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేశారు. కాగా, పాకిస్తాన్‌పై దాడి సన్నాహాల్లో భాగంగా సైన్యం మోహరించినట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దుల్లో 193 బెటాలియన్లు మోహరించాయి. ఒక్కో బెటాలియన​్‌లో దాదాపు 1000 మందికిపైగా సైనికులు ఉన్నారు. 

ఇదిలా ఉండగా.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి కీడు తలపెట్టాలని చూసేవారి తాట తీయడంలో సైనిక బలగాలతో కలిసి పనిచేయడం, దేశ సరిహద్దుల్ని కాపాడుకోవడం తన కర్తవ్యమని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గురించి ప్రజలకు బాగా తెలుసునని.. ఆయన పనితీరు, కట్టుబాటు, జీవితంలో రిస్కు తీసుకునే విధానంపైనా వారికి అవగాహన ఉందని చెప్పారు. ప్రజలు కోరుకున్నవన్నీ మోదీ నేతృత్వంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పారు. అంతకు మించి దానిపై వివరించలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement