కడప గడపలో క్రికెట్ సందడి నెలకొంది. నగరంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం లో ఏపీఎల్(Andhra Premier League 2026) మ్యాచ్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.
రెండో రోజు గురు వారం ఫ్లడ్ లైట్ల వెలుగులో క్రికెట్ మ్యాచ్ చూడడానికి జిల్లా వ్యాప్తంగా క్రీడాభిమానులు తరలివచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సినీగీతాల ఆలాపన ఆకట్టుకుంది.


