ఎస్‌ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌ అయ్యాడు! | meet this man Quits Job Moves To Australia To Become Real Estate Agent | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌ అయ్యాడు!

Jun 18 2026 12:47 PM | Updated on Jun 18 2026 2:19 PM

meet this man Quits Job Moves To Australia To Become Real Estate Agent

ప్రభుత్వం ఉద్యోగం, అదీ ఎస్‌ఐ ఉద్యోగం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ  ఢిల్లీ పోలీస్ శాఖలో  ఎస్‌ఐ  ఉద్యోగాన్ని వదిలేసి, ఆస్ట్రేలియా వలస వెళ్లి అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా సెటిల్‌ అయ్యాడు.  ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. నిశాంత్ తోమర్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్న స్ఫూర్తిదాయక ప్రయాణ వివరాలేంటో తెలుసుకుదాం.

నిశాంత్ తోమర్ భారతదేశంలోఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. అది ఆయనకి తృప్తి నివ్వలేదు. రిస్క్‌ తీసుకుంటే తప్పజీవితంలో ఏమీ సాధించలేననున్నారు. అంతే జీవితాన్ని మలుపు తీప్పే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఏంటి ఈ నిర్ణయం  పిచ్చా అని అందరూ ఖండించారు. అయినా సరే తన మనసు మాటే విన్నారు. 2023లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆస్ట్రేలియా విమానం ఎక్కేశారు. (రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!)

అక్కడ భవిష్యత్తుపై ఎలాంటి గ్యారంటీ లేదు. అయినా రిస్క్‌ చేశారు. జీరో నుంచే జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ పయనంలో ఎన్నో కష్టనష్టాలు తప్పలేదు. ఒక గౌరవప్రదమైన హోదా  ఉన్న ఉద్యోగం నుంచి విదేశాలలో ఎంట్రీ-లెవెల్  జాబ్స్‌ చేయడం, తన సొంతవాళ్లకు దూరంగా కొత్త వాతావరణం, ఒంటరితనం ఇలాంటి ఎన్నో మానసిక, సామాజిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నిఅడ్డంకులను అధిగమించి ఆస్ట్రేలియాలో సొంత ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా, ప్రస్తుతం అక్కడ ఒక విజయవంతమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారారు. అంతేకాదు ఆస్ట్రేలియాలో వారి మొదటి సొంత ఇంటి కలని సాకారం చేసుకోవాలనుకునే వారు నిశాంత్‌ను  సంప్రదిస్తున్నారు. ఆయన సాయంతో తమ డ్రీమ్‌ హౌస్‌ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం.

అంత ఈజీగా కాలం కలిసి రాలేదు. అవకాశాలను అందుపుచ్చుకోవడం, కొత్త ప్రదేశానికి అనుగుణంగా తనను తాను మార్చు కోవడం, కష్టాలొచ్చాయని కుంగిపోకుండా, వెనకడుగు వేయకుండా ముంకు సాగడం వల్లే ఇది సాధ్యమైంది అంటారు నిశాంత్. కొన్నిసార్లు మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టే నిర్ణయాల నుండే జీవితంలో అతిపెద్ద అవకాశాలొస్తాయి అని విదేశాల్లో కరియర్‌ వెతుక్కునే వారికి సలహా ఇస్తారు.  

 నిశాంత్‌ చేసిన వీడియో నెట్టింట పలువుర్ని ఆకర్షిస్తోంది.విదేశాల్లో స్థిరపడాలని కలలుకుంటున్న ఎంతో మంది భారతీయులకు ఈ కథ బాగా కనెక్ట్ అయింది. నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ, "ఆస్ట్రేలియా వెళ్లాక రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి ఎలాంటి కోర్సులు లేదా ఉద్యోగాలు చేశారు?" అని కామెంట్ల రూపంలో ఆసక్తిగా అడుగుతున్నారు. ఈ వీడియోకి వేలాది లైక్స్‌  వ్యూస్‌ వచ్చాయి.

ఇదీ చదవండి : అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్‌ డ్రైవర్‌గా ఇపుడు లక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement