ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా | Constable Movie Released In 2025 Is Now Streaming On OTT | Sakshi
Sakshi News home page

OTT: గతేడాది థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్

Jun 17 2026 4:51 PM | Updated on Jun 17 2026 5:05 PM

Constable Movie Released In 2025 Is Now Streaming On OTT

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా రేజర్, కేనతా కానం, దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 లాంటి తెలుగు స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్, సిరీస్‌లు రాబోతున్నాయి. ఇవలా ఉండగానే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ అదేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)

కొత్త బంగారులోకం, హ్యాపీడేస్ సినిమాలతో అప్పట్లో గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. మధ్యలో చాన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ షో తర్వాత మళ్లీ కాస్తంత పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. అలా చేసిన చిత్రమే 'కానిస్టేబుల్'. గతేడాది అక్టోబరు 10న థియేటర్లలోకి వచ్చింది. తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

'కానిస్టేబుల్' విషయానికొస్తే.. శంకరపల్లి అనే ఊరిలో కాశీ (వరుణ్ సందేశ్) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. అయితే ఈ ఊరిలో చాలామంది హత్యకు గురవుతూ ఉంటారు. కాశీ మేనకోడలిని కూడా చంపేస్తారు. అసలు ఈ మర్డర్స్ చేస్తుందెవరు? సీరియల్ కిల్లర్‌ని కాశీ పట్టుకున్నాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement