Constable Movie
-
వరుణ్ సందేశ్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది
వరుణ్ సందేశ్, మధులిక జంటగా చిత్రం కానిస్టేబుల్. ఈ మూవీకి ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ మూవీ నుంచి 'మేఘం కురిసింది' అనే క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..' శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైxof. పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. ప్రేక్షకుల ఆదరణ పొందాలి. సినీ పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారని.. వారిని ప్రోత్సహించాలని' సూచించారు.సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్‌గా మారిందని చెప్పారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీశ్, నాయకులు జగ్గయ్య, రమణ పాల్గొన్నారు. -
సమాజమే నీ సేవకు సలాం
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్‌పై బలగం జగదీష్ నిర్మించారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతులమీదుగా విడుదల చేశారు.‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న... కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా....’ అంటూ ఈ పాట సాగుతుంది. శ్రీనివాస్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల మీద వచ్చిన ఈ పాటని నేను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి పోలీస్ ఈ సాంగ్ వింటారు’’ అన్నారు. ‘‘కానిస్టేబుల్..’ పాటని సీవీ ఆనంద్‌గారు విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. ‘‘కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల. అది నెరవేరకపోవడంతో ఈ సినిమా నిర్మించాను’’ అని బలగం జగదీష్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ అందర్నీ స్పందింపజేస్తుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. -
నల్లగొండ గద్దర్ నోట ‘కానిస్టేబుల్’ పాట
వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి నటిస్తోంది. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. "కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న...కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా" అంటూ సాగే టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ చేతుల మీదగా విడుదల చేశారు. ఈ పాటకు శ్రీనివాస్ తేజ సాహిత్యాన్ని అందించగా సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు. నల్గగొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, నేను ఆవిష్కరించిన ఈ టైటిల్ సాంగ్ చాలా బావుంది. మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మీద ఈ సాంగ్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రతీ పోలీస్ ఈ సాంగ్ వింటారు" అని అన్నారు.హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సి వి ఆనంద్ గారు ఈ పాట విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు మంచి కం బ్యాక్ సినిమా అవుతుంది. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను" అని అన్నారు.నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, "కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల అది నెరవేరకపోవడంతో ఆ టైటిల్ తో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. కానిస్టేబుల్ ల మీద నాకున్న గౌరవంతో ఒక అద్భుతమైన పాటను నేను దగ్గరుండి రాయించి, నల్గొండ గద్దర్ నరసన్న తో పాటించడం జరిగింది. ఈ పాటను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. .దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, మంచి కథ, కథనాలు, పాత్రలో వరుణ్ ఒదిగిపోయిన విధానం, నిర్మాత అభిరుచి ఈ చిత్రం అద్భుతంగా రావడానికి దోహదం చేసిందని అన్నారు. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ ఎంతగానో స్పందింప జేస్తుందని అన్నారు. -
సస్పెన్స్... థ్రిల్
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అని అర్థం అవుతోంది. ‘కానిస్టేబుల్’ చిత్రం హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ మూవీ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు వరుణ్ సందేశ్. ‘‘కానిస్టేబుల్’ వరుణ్ సందేశ్‌కి మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంది’’ అని తెలిపారు బలగం జగదీష్. ‘‘ఈ చిత్రానికి అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు ఆర్యన్. ఈ సినిమాకు సంగీతం: సుభాష్ ఆనంద్. -
‘కానిస్టేబుల్’గా వరుణ్ సందేశ్
హ్యాపీ డేస్’ ఫేమ్ వరుణ్ సందేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు వరుసగా ప్రేమ కథలు చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తన పంథాను మార్చుకున్నాడు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల ‘నింద’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. త్వరలోనే మరో డిఫరెంట్ మూవీతో అలరించడానికి రాబోతున్నాడు. అదే ‘కానిస్టేబుల్’.ఆర్యన్ సుభాన్ ఎస్కే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ని నెల్లూరు టౌన్ హాల్లో కలెక్టర్ కే. కార్తిక్, సినిమా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చరవేగంగా జరుగుతున్నాయి అంటూ తెలిపారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిదని చెప్పగా చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీసర్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపారు.