‘కానిస్టేబుల్’కి 30 లక్షలు! | Constable movie Trailer Got 30 Million Views | Sakshi
Sakshi News home page

‘కానిస్టేబుల్’కి 30 లక్షలు.. ఆనందంగా ఉందన్న వరుణ్‌ సందేశ్‌

Sep 10 2025 7:52 PM | Updated on Sep 10 2025 9:19 PM

Constable movie Trailer Got 30 Million Views

"హ్యాపీడేస్, కొత్త బంగారులోకం" వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ఇప్పటివరకు అనేక చిత్రాలు చేసినప్పటికీ  లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’ తో మాస్ కమర్షియల్  హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ..‘ఈ సినిమాట్రైలర్ ను ఆగస్టు 31 వ తారీఖున రిలీజ్ చేశాం. ,నాటి నుంచి  ఇప్పటివరకు జనాల్లో విశేష స్పందన వస్తోంది. 30 లక్షల మందికి పైగా ఈ ట్రైలర్ ని ఆదరించారు. మా  అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది.  త్వరలో భారీగా ప్రపంచవ్యాప్తంగా  చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం’ అని అన్నారు.  

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ‘టైలర్ కి అద్భుత స్పందన రావడం ఆనందదాయకం. సినిమా సస్పెన్స్ తో పాటు ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ప్రతి ఒక్కరికి నచ్చే విదంగా ఉంటుంది, అలాగే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది’అని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement