
బలగం జగదీష్, వరుణ్ సందేశ్, రాజేంద్ర ప్రసాద్, మధులిక, ఆర్యన్
‘‘కానిస్టేబుల్’ సినిమా కంటెంట్ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. వరుణ్ సందేశ్ తన పాత్రలో ఒదిగిపోయి ఉంటాడని భావిస్తున్నాను’’ అని అన్నారు రాజేంద్రప్రసాద్. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో ‘బలగం’ జగదీష్ నిర్మించిన థ్రిల్లర్ చిత్రం ‘కానిస్టేబుల్’. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రయూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసి, మాట్లాడారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు ఆర్యన్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు కానిస్టేబుల్ క్యారెక్టర్‌ను ఊహించుకుని, చేయగలననే నమ్మకం ఏర్పడిన తర్వాతే ఈ సినిమా చేశాను’’ అని చెప్పారు. ‘‘ఒక వ్యక్తికి అవమానం జరిగినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశానికి సందేశాన్ని మిళితం చేసి, ఈ చిత్రం చేశాం’’ అని పేర్కొన్నారు ‘బలగం’ జగదీష్.
‘‘ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉండగా, ఒక పాటను చంద్రబోస్‌గారు, మరో పాటను గద్దర్ నర్సన్న పాడారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమా ఇది’’ అని చెప్పారు ఆర్యన్ సుభాన్. ‘‘మన భద్రత కోసంపోలీస్‌వారు అహర్నిశలూ ఎంతో శ్రమ పడుతున్నారు. ఇలాంటి అంశాలతో తీసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అని అన్నారు తెలంగాణ కల్చరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డి. ఈ కార్యక్రమంలో ముగ్గురు కానిస్టేబుల్స్‌ను యూనిట్ సత్కరించింది.