
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన సినిమా 'కానిస్టేబుల్'. ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించగా బలగం జగదీష్ నిర్మించారు. థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్ లాంచ్ చేశారు.
(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు)
ఇప్పటివరకు లవర్ బాయ్‌గా నాకు పేరుంది. సినిమాతో పాటు నా పాత్ర కూడా బాగా వచ్చిందని మూవీ టీం చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా మా అంచనాలని 'కానిస్టేబుల్' నిలబెడుతుందని అనుకుంటున్నానని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. మా అందరి కెరీర్ మలుపుతిప్పే చిత్రం ఇది అవుతుంది. వరుణ్ సందేశ్‌కి కూడా కమ్ బ్యాక్ ఇస్తుందని దర్శకుడు ఆర్యన్ సుభాన్ అన్నారు.
(ఇదీ చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా)