సమాజమే నీ సేవకు సలాం | Varun Sandesh Constable Title Song Launched by Hyderabad Police Commissioner CV Anand | Sakshi
Sakshi News home page

సమాజమే నీ సేవకు సలాం

Jan 27 2025 3:23 AM | Updated on Jan 27 2025 3:23 AM

Varun Sandesh Constable Title Song Launched by Hyderabad Police Commissioner CV Anand

వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్‌’. ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్‌పై బలగం జగదీష్‌ నిర్మించారు. సుభాష్‌ ఆనంద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్‌..’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చేతులమీదుగా విడుదల చేశారు.

‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న...  కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా....’ అంటూ ఈ పాట సాగుతుంది. శ్రీనివాస్‌ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని నల్గొండ గద్దర్‌ నర్సన్న ఆలపించారు.

ఈ సందర్భంగా సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ– ‘‘మా కానిస్టేబుల్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల మీద వచ్చిన ఈ పాటని నేను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి పోలీస్‌ ఈ సాంగ్‌ వింటారు’’ అన్నారు. ‘‘కానిస్టేబుల్‌..’ పాటని సీవీ ఆనంద్‌గారు విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం’’ అని వరుణ్‌ సందేశ్‌ చెప్పారు. ‘‘కానిస్టేబుల్‌ కావడం నా చిన్ననాటి కల. అది నెరవేరకపోవడంతో ఈ సినిమా నిర్మించాను’’ అని బలగం జగదీష్‌ తెలిపారు. ‘‘ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్‌ సాంగ్‌ అందర్నీ స్పందింపజేస్తుంది’’ అన్నారు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement