
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. బలగం జగదీష్ నిర్మాతగా ఆర్యన్ సుభాష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ఈ వారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీలో కానిస్టేబుల్‌గా వరుణ్ సందేశ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు? అసలు ఈ మూవీ కథ ఏంటి? అన్నది చూద్దాం..
కథేంటంటే..
మోకిలా మండలంలోని శంకరపల్లి ఊర్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆడ, మగ అని తేడా లేకుండా జరుగుతున్న ఈ సీరియల్ కిల్లింగ్స్ పోలీసులకు పెద్ద ఛాలెంజింగ్‌గా మారుతుంది. అయితే ఈ ఊరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా కాశీ (వరుణ్ సందేశ్) పని చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్‌లో కాశీ మేనకోడలు కీర్తి (నిత్య శ్రీ) కూడా బలి అవుతుంది. మరి ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనకాల ఉన్నది ఎవరు? కాశీ ఆ కిల్లర్‌ను పట్టుకుంటాడా? ఎవరిని అనుమానించినా సరే చివరకు వాళ్లు కూడా చనిపోతుంటారు? అసలు వీటన్నంటి వెనకాల ఉన్నది ఎవరు? చివరకు ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సీరియల్ కిల్లర్స్, క్రైమ్ స్టోరీలకు ఓ ఫార్మూలా ఉంటుంది. చాలా మంది ఆ ఫార్మూలాను వాడుకుని కథను అల్లుకుంటారు. కానీ కానిస్టేబుల్ విషయంలో మాత్రం అంతా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. ఆడియెన్స్ ఊహించి ఏదీ కూడా తెరపై జరగదు. ప్రతీ ఒక్క చోట ప్రేక్షకుడ్ని సర్ ప్రైజ్ చేసుకుంటూ వెళ్తుంది.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా సీరియల్ కిల్లింగ్స్, కొందరి మీద అనుమానం వచ్చేలా సీన్లను చూపించడం, హీరో ఇంట్లోనే విషాదం జరగడం వంటి సీన్లతో సాగుతుంది. ఇంటర్వెల్‌కు ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ రివీల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే ఊహకు భిన్నంగా ఉంటుంది. అలా మొత్తానికి ఓ మంచి క్రైమ్, థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ చిత్రంలో కాశీ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటాడు. వరుణ్ సందేశ్‌కు ఇలాంటి పాత్ర చాలా కొత్త. ఈ మూవీలో వరుణ్ సందేశ్ లుక్స్, యాక్టింగ్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌కు సర్ ప్రైజింగ్‌గా ఉంటాయి. హీరోయిన్ మధులిక పాత్ర కూడా మెప్పిస్తుంది. యాక్టింగ్‌కు ఓ మోస్తరుగా స్కోప్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక భవ్య శ్రీ, నిత్య శ్రీ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. అసలు ట్విస్ట్ ఏంటి? విలన్ ఎవరన్నది మాత్రం సినిమాలో చూస్తేనే కిక్ వస్తుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఇలాంటి సీరియల్ కిల్లింగ్ స్టోరీలకు ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. ఇందులోనూ మంచి ఆర్ఆర్ ఉంటుంది. షైక్ హజారా కెమెరా కూడా సీన్లకు తగ్గట్టుగా మూడ్‌ను రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. మాటలు, పాటలు పర్వాలేదనిపిస్తాయి.ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగానే ఉన్నాయి.