
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన సినిమా 'కానిస్టేబుల్'. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించారు. అక్టోబరు 10న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ చిత్రం తన కెరీర్‌కు మరో మలుపు అవుతుందని హీరో వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు.
నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. సెన్సార్ పూర్తి కావడం, ట్రైలర్ కి వస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇందులోని ఓ మంచి ఐటమ్ సాంగ్‌ని దసరా సందర్భంగా విడుదల చేశాం. దానికి కూడా మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది అని అన్నారు.