ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి : వరుణ్‌ సందేశ్‌ | Varun Sandesh Talk About Constable Movie At Pre Release Event | Sakshi
Sakshi News home page

ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి : వరుణ్‌ సందేశ్‌

Oct 7 2025 5:25 PM | Updated on Oct 7 2025 5:51 PM

Varun Sandesh Talk About Constable Movie At Pre Release Event

‘నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం "హ్యాపీడేస్" 2007లో ఇదే నెలలో విడుదలై, ఘన విజయం సాధించి, నా కెరీర్ నే మలుపు తిప్పింది. అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండి పోయింది. ఇప్పుడు కానిస్టేబుల్ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు.

వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, సందేశం వంటి అంశాలను మిళతం చేసి రూపొందించడం జరిగింది" అని అన్నారు.

నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ, "ఈ చిత్రానికి సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 10న చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నాం. ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని చూపించాం. అమ్మాయిలతో పాటు తల్లి తండ్రులు కూడా ఈ సినిమాను చూడాలి" అని అన్నారు.

దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని పెంచింది. నిర్మాత కథను నమ్మి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈ సినిమా తెరపైకి వచ్చింది" అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement