అమెరికాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ (Times Square) మరోసారి కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడున్న పర్యాటకులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. పలువురు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారి కాల్పులకు దారితీసింది. వెస్ట్ 44వ వీధి, సెవెంత్ అవెన్యూ సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపినట్లు వీడియోల్లో కనిపించింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న వందలాది మంది భయంతో దుకాణాలు, భవనాల లోపలకి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలైనట్లు అత్యవసర సేవల విభాగం తెలిపింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు.. అనుమానితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిలో ఒక ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు, ఇతర అనుమానితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
BREAKING: Shots fired in Times Square in Manhattan, New York, after the Knicks parade.
No injuries have been reported. pic.twitter.com/hFXaHUKwmG— World Source News (@Worldsource24) June 18, 2026
కాగా, ఇటీవలే న్యూయార్క్ ఎన్‌బీఏ ఛాంపియన్‌షిప్ గెలిచిన సందర్భంగా నగరంలో భారీ సంబరాలు జరిగాయి. ఆ వేడుకల నేపథ్యంలో లక్షలాది మంది వీధుల్లోకి రావడంతో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ, గత కొన్ని రోజులుగా టైమ్స్ స్క్వేర్ పరిసరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కాల్పుల శబ్దాలు వినిపించగానే ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన టైమ్స్ స్క్వేర్‌లో ఈ ఘటన జరగడం భద్రతా వ్యవస్థలపై మరోసారి చర్చకు దారితీసింది.
WOW🚨: After shots were fired in Time Square..this woman tried to save his life and he tried to kiss her for it 😭 pic.twitter.com/aBPGabkh7n
— Officer Lew (@officer_Lew) June 18, 2026


