పులివెందుల రూరల్ : మండల పరిధి ఆర్.తుమ్మలపల్లె గ్రామ సమీపంలోని గంగమ్మ చింతల ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు, తలకు టోపీలు ధరించి తలువులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారికి అలంకరించి ఉన్న సుమారు 3.750 గ్రాముల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని, వీటి విలువ రూ.3.90 లక్షలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆలయంలోని సీసీ కెమెరాలలో గుర్తు తెలియని వ్యక్తులు వెండి ఆభరణాలు అపహరించిన దృశ్యాలు రికార్డు అయ్యాయన్నారు. ఇప్పటికై నా సంబంధిత పోలీసు అధికారులు స్పందించి ఆలయాల వద్ద గస్తీ ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


