రక్తమోడిన రహదారులు | - | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రహదారులు

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

రాజంపేట : రాజంపేటలోని తిరుపతి, కడప బైపాస్‌ రోడ్‌లో శుక్రవారం వేర్వేరు రోడ్డుప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఓబులవారిపల్ల మండల గాడివారిపల్లెకుచెందిన కోటకొండ సుబ్బమ్మ (56), తిరుపతి ఆటోనగర్‌కు చెందిన పూర్ణచంద్రరాజు మృతి చెందారు.పోలీసులు స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టరం నిమిత్తం రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నీళ్లు చల్లించేందుకు వచ్చి కాటికి...

తిరుపతి ఆటోనగర్‌కు చెందిన పూర్ణచంద్రరాజు , బత్తలబాలాజీ, కృష్ణమనేని శశిధర్‌లు గురువారం రాత్రి కడపకు కారులో బయలుదేరారు. రాజంపేట బైపాస్‌లో ఉస్మాన్‌నగర్‌ వద్దకు రాగానే ప్రైవేటుబస్సు, కారు ఢీ కొన్నాయి. ముందుసీటులో ఉన్న పూర్ణచంద్రరాజు అక్కడక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న బత్తలబాలాజీ, వెనక సీట్‌లో కూర్చున్న కృష్ణమనేని శశిథర్‌ గాయపడ్డారు.బత్తల బాలాజీ పెద్దనాన్న ఇటీవల మృతి చెందారు. పెద్దకర్మలో భాగంగా వీరు నీళ్లు చల్లించేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. విషాదం నింపింది.

వైఎస్సార్‌ కడప జిల్లాలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement