ద్వారకకు రైలు! | - | Sakshi
Sakshi News home page

ద్వారకకు రైలు!

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

ద్వారకకు రైలు!

రాజంపేట: జిల్లా మీదుగా నేరుగా గుజరాత్‌ రాష్ట్రంలోని ద్వారకకు వెళ్లే వీక్లీ ట్రైన్‌కు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. జిల్లాలో ఓకా–తిరుపతి మధ్య 19560/19559 నెంబర్లతో ఈ రైలు నడవనుంది. ఈ నెల 19న ఓకా స్టేష్టన్లో అక్కడ ఎంపీ పూరంభీన్‌, ఎమ్మెల్యే పభూభా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ రైలుకు రిజర్వేషన్ల సౌకర్యం కూడా కల్పించారు. దేశంలో ప్రసిద్ధి చెందిన రెండు పుణ్యక్షేత్రాలను అనుసంధానంగా నడుస్తున్న ఈ రైలుకు భక్తుల నుంచి పెద్ద ఆదరణ వస్తుందని రైల్వే శాఖ భావిస్తుంది.

ఓకా–తిరుపతి రైలు ఇలా

ఓకా–తిరుపతి మధ్య (19560) వారంలో ఓకా నుంచి సోమవారం బయలుదేరుతుంది. 19550 నెంబర్‌తో వారంలో ప్రతి గురువారం తిరుపతి నుంచి బయలుదేరుతుంది.

కోచ్‌ పొజిషన్‌: ఓకా–తిరుపతి మధ్య నడిచే రైలుకు సెకెండ్‌ ఏసీ రెండు, థర్డ్‌ ఏసీ 3, స్లీపర్ల కోచ్‌ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు రాష్ట్రంలోకి ప్రవేశించిన అనంతరం కర్నూల్‌ టౌన్‌, డోన్‌, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతి స్టేషన్‌ చేరుకుంటుంది.

ఇదే మార్గంలో...

ఇప్పటికే జిల్లా మీదుగా ద్వారకా వరకు దక్షిణ రైల్వే జోన్‌ వారు రామేశ్వరం నుంచి ఓఖా వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌ రైలు నడుపుతున్నారు. కానీ ఈ రైలుకు రాజంపేట రైల్వే స్టేషన్‌లో సదుపాయం లేకపోవడంతో కడప లేదా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడి నుంచి ద్వారకా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. మొట్ట మొదటి సారి రాజంపేట రైల్వే స్టేషన్‌ నుంచి గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌ నగర్‌, రాజ్‌ కోట్‌, ద్వారకా లాంటి పట్టణాలతో ఈ నూతన రైలు ద్వారా అనుసంధానం ఏర్పడింది.

ద్వారక ఆలయం

జిల్లా మీదుగా పయనం

కడప, రాజంపేటలో హోల్డింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement