వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులో గంజికుంట ప్రశాంత్(27) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వల్లూరుకు చెందిన ప్రశాంత్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం కడపలోని రాజారెడ్డి వీధికి చెందిన సునీతతో ఇతనికి వివాహం జరిగింది. మంగళవారం సాయంత్రం తన భార్యను ఆటోలో కడపలోని ఆమె పుట్టింట్లో వదిలి రేపు వచ్చి తీసుకుని వెళ్తానని చెప్పి వచ్చాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలో బుదవారం వల్లూరులోని తన ఇంటిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇతనికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.


