ఎన్‌హెచ్ 716 రహదారి నిర్మాణంవల్ల అధికారులు అర్హులైన రైతులకు అన్యాయం చేశారు. మల్లేల చెరువు నుంచి మా భూమి వద్దకు దాదాపు 3కి.మీ మేర పైపులైన్లు వేసి రూ.6లక్షల మేర ఖర్చు చేసి చీనీ చెట్లకు నీటి తడులు అందించేవారం. రోడ్డు నిర్మాణంలో భాగంగా పైపులైన్ పూర్తిగా దెబ్బతిని నష్టం జరిగింది. నష్టపరిహారం అందించాలని అధికారులను కోరినా మా గ్రామానికి విచారణకు వచ్చిన అధికారులు మాతో మాట్లాడకుండా మమ్ములను విచారించకుండా వెళ్లిపోయారు.
– ఇసుకపల్లె రంగారెడ్డి, చీనీ రైతు, మల్లేల


