జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణ పరిధిలో బుధవారం గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో డానియేలు (65) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దముడియం మండలం గరిశలూరు గ్రామానికి చెందిన డానియేలు బ్యాంక్ పని నిమిత్తం జమ్మలమడుగు పట్టణానికి ద్విచక్రవాహనంలో వచ్చాడు. పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెలుతుండగా రామిరెడ్డిపల్లె శివార్లలో వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో డానియేలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య వసంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


