ఆటోలాగి.. చమురు వదిల్చారు! | - | Sakshi
Sakshi News home page

ఆటోలాగి.. చమురు వదిల్చారు!

May 17 2026 7:14 AM | Updated on May 17 2026 7:14 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్‌ పై మూడు రూపాయలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం వెయ్యడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్‌ డిమాండ్‌ చేశారు. నపెంచిన డీజిల్‌ పెట్రోల్‌ ధరలు ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్‌ వద్ద ఆటోను తాడుతో లాగుతూ 7 రోడ్ల కూడలి వరకు నిరసన కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు అన్వేష్‌, దస్తగిరిరెడ్డి, చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, శివకుమార్‌, నారాయణరెడ్డి, తిమ్మయ్య, అన్వర్‌, విజయ్‌, రఘు, విశ్వనాధ్‌, పెద్దన్న, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement