పీజీఆర్‌ఎస్, వాట్సాప్ గవర్నెన్స్, రెవెన్యూ క్లినిక్ ఇలా పలు పేర్లతో కార్యక్రమాలు చేపట్టారు. ఎన్ని పేర్లు పెట్టినా సమస్యలు యథాతథంగా ఉన్నాయి. దీంతో అనేక వ్యయ ప్రయా సలు కోర్చి ప్రజలు పీజీఆర్‌ఎస్‌కు వస్తున్నారు. క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పటిష్టవంతమైన చర్యలు తీసుకోవాలి. అర్జీలను గడువులోపు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించకుండా వన్‌మంత్...వన్ విలేజ్...అనే కొత్త పేరుతో రావడం వల్ల ఉపయోగం లేదు. – ఎ.రామ్మోహన్‌రెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి, కడప


