కడప సెవెన్‌రోడ్స్: కడప అల్ట్రా మెగా సోలార్ పార్కు (1000 మెగా వాట్లు) పరిధిలో ఎల్‌ఏడీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నాల్గవ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సోలార్ పార్క్ పరిధిలో ప్రభావిత గ్రామాలు, ప్రభావితం కాని గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు విడుదల చేసిన నిధులకు సంబంధించి పనుల పురోగతి, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మంజూరైన నిధులతో గ్రామ సచివాలయ సముదాయాల అభివృద్ధి, సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, కాంపౌండ్ వాల్, పార్కింగ్ టైల్స్, ప్లేగ్రౌండ్ లెవలింగ్, వెటర్నరీ భవనాల అభివద్ధి వంటి పనులను చేపట్టేందుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సోలార్ పార్క్ పరిధిలోని గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా నిధులను వినియోగిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సోలార్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎస్‌ఈ ఎం. శివశంకర్ నాయుడు, సీనియర్ ఇంజనీర్/సివిల్ అశోక్ కుమార్, సీపీవో హజరతయ్య పాల్గొన్నారు.
జూన్ 12 నాటికి గురుకుల
విద్యాలయాన్ని సిద్ధం చేయాలి
జిల్లాలో అధునాతన వసతులతో నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో రూపుదిద్దుకున్న మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాన్ని జూన్ 12 నాటికి సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో తొండూరు మండలంలోని మల్లెల గ్రామంలో నూతనంగా రూపుదిద్దుకున్న మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో పెండింగ్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నూతన భవనంలో సదుపాయాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


