కార్పొరేషన్‌లో ఒకరి సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌లో ఒకరి సస్పెన్షన్‌

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

కార్పొరేషన్‌లో ఒకరి సస్పెన్షన్‌ అధ్యాపక నియామక నోటిఫికేషన్‌ రద్దు సూర్యప్రభ వాహనంపై శ్రీవారి అనుగ్రహం ఈసెట్‌ ఫలితాలలో ఫస్ట్‌ ర్యాంక్‌ ముగిసిన అన్నమాచార్యుడి జయంత్యుత్సవాలు

కడప కార్పొరేషన్‌: జన గణన మొదటి దశ నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఒక ఉద్యోగిని సస్పెండ్‌ చేస్తూ నగరపాలక కమిషనర్‌ రాకేష్‌ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో ఆరుగురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం, అధికారుల ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడం వంటి కారణాలతో ఆ ఉద్యోగిని సస్పెండ్‌ చేశామని, అలాగే జనగణన ప్రారంభమై ఏడు రోజులు పూర్తయినా ఇప్పటి వరకూ విధులు ప్రారంభించని ఆరుగురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. జనగణనలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు.

కడప ఎడ్యుకేషన్‌: డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి తీర్మానం, ప్రభుత్వ జీఓ నెం. 70 ప్రకారం గతంలో ఇచ్చిన 138 అధ్యాపక పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ను రద్దు చేశామని రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పొఫెసర్‌ పోస్టులు ఉన్నాయన్నారు. 2023 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు రుసుమును తిరిగి పొందేందుకు సంబంధిత సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని పేర్కొన్నారు. కొత్త నోటిఫికేషన్ల తేదీలు, ఇతర వివరాలు విడిగా ప్రకటిస్తామని వివరించారు.

జమ్మలమడుగు: నారాపురస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దేవదేవుడు సూర్యప్రభ వాహనంపై ఽభక్తులకు దర్శనం ఇచ్చారు. కల్యాణోత్సవం, రథోత్సవం పూర్తయిన తర్వాత శుక్రవారం ఉదయం స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.భక్తులు స్వామివారిన దర్శించుకుని తరించారు.

పులివెందుల టౌన్‌: ఈసెట్‌ ఎంట్రెన్స్‌ ఫలితాలలో పులివెందుల లయోలా పాల్‌టెక్నిక్‌ (వైఎస్‌ఆర్‌ఆర్‌) కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కళాశాలకు చెందిన విద్యార్థిని ఎం.గీతిక రాష్ట్రస్థాయిలో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చిందని కళాశాల ప్రిన్సిపల్‌ బ్రిట్టో హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తెలుపుతూ తమ కళాశాలకు చెందిన ఎన్‌.పద్మప్రియ స్టేట్‌ 3వ ర్యాంకు, జి.లోకేష్‌ స్టేట్‌ 25వ ర్యాంకులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారన్నారు. రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతిక తండ్రి శివశంకర్‌రెడ్డి పులివెందులలో సాధారణ రైతు కాగా.. తల్లి ఎం.కేశవి గృహిణిగా ఉంటూ కుమార్తెను బాగా చదివించడంపట్ల స్థానిక ప్రజలు, కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

రాజంపేట: తాళ్లపాక అన్నమాచార్యుని జయంత్యుత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరిరోజు తాళ్లపాక ధ్యానమందిరంలో మోహన్‌, గోపికృష్ణ బృందం సంకీరన్తలు ఆలపించారు. బోయనపల్లె గ్రామానికి చెందిన శ్రీ కోదండరామ కళానాట్యమండలి మహేంద్రస్వామి ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య జీవిత ఘట్టాల ప్రదర్శన కన్నులపండువగా సాగింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ సీ.లత, తాళ్లపాక దేవాలయాల ఇన్‌స్పెక్టర్‌ బాలాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలను ధర్మాచార్యులు గంగనపల్లె వెంకటరమణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement