కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీఈఏపీసెట్)–2026 మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(భైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట పరీక్షా కేంద్రాలలో ఆన్‌లైన్ విధానంలో 9 పరీక్షా కేంద్రాలలో ఏపీ ఈఏపీ పరీక్షను నిర్వహించారు. ఇందులో ఉదయం, సాయంత్ర రెండు సెషన్స్‌కు సంబంధించి 1668 మందికిగాను 1567 మంది హాజరుకాగా 101 మంది గైర్హాజరయ్యారు.


