అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు

కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌

మైదుకూరు: జిల్లాలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ అన్నారు. మండలంలోని ముదిరెడ్డిపల్లె, మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లె చెరువులకు ‘జలధార – సాగునీటి సంరక్షణ’ కింద నీరందించే పనులను శుక్రవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌తో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఎమ్మెల్యే సుధాకర్‌ యాదవ్‌ మాట్లాడారు. బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యారత్నాలు

పదో తరగతి ఫలితాల్లో శెట్టివారిపల్లె హైస్కూల్‌ విద్యార్థిని వీర ఉదయశ్రీ జిల్లాలో రెండో స్థానంలో నిలవడం గర్వకారణమని కలెక్టర్‌ తెలిపారు. సభలో వీర ఉదయశ్రీని అభినందించారు.

సత్కారం: కడపలోని మాధవి కన్వెన్షన్‌ హాల్లో కాగా శుక్రవారం రాత్రి ‘విద్యా రత్నాలు’ అవార్డుల కార్య క్రమం జరిగింది. పదో తరగతి ఫలితాల్లో రాణించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement