విద్యార్థుల జీవితాలతో ఆటలా | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలతో ఆటలా

May 13 2026 1:32 AM | Updated on May 13 2026 1:32 AM

ప్రస్తుతం రాసిన నీట్‌ పరీక్షలో మంచి మార్కులు వస్తాయని భావిస్తున్నాను. నీట్‌ రద్దు కావడం చాలా బాధగా ఉంది. ప్రతిసారి ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఈసారైనా పేపర్‌ లీక్‌ కాకుండా ప్రభుత్వం గట్టిగా చర్యలు చేపట్టాలి. – జె.కీర్తన, కమలాపురం

గుణపాఠాలు నేర్వకపోవడం శోచనీయం

మా పాప ఫిర్దోస్‌కు ఇంటర్లో 922 మార్కులు వచ్చాయి. నీట్‌ పై చాలా ఆశలు పెట్టుకున్నాం. దేశవ్యాప్తంగా జరిగే ప్రవేశ పరీక్షను ఇంత అధ్వానంగా నిర్వహించడం దారుణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో జరిగిన సంఘటనల నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోకపోవడం శోచనీయం. ఇప్పటికై నా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నీట్‌ పరీక్షను నిర్వహించాలి. – షేక్‌ బాషు,

విద్యార్థిని తండ్రి, కమలాపురం

ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

వైద్య వృత్తిపై ఎన్నో ఆఽశలు పెట్టుకుని నీట్‌ పరీక్ష రాస్తే ఎక్కడో పేపర్‌ లీక్‌ అయిందని దేశ వ్యాప్తంగా పరీక్షను రద్దు చేయడం బాధాకరం. నా కుమారుడు గురు ప్రవీణ్‌రెడ్డి పరీక్ష బాగా రాశాడు. ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో పరీక్ష రద్దు అయిందని తెలియగానే తేగా ఆందోళన చెందుతున్నాడు. పకడ్బందీగా పరీక్షను నిర్వహించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.

–కంకర అపర్ణ, విద్యార్థి తల్లి,

చిన్నవెంతుర్లగ్రామం, మైలవరం మండలం

Advertisement
 
Advertisement
Advertisement