ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఇద్దరు బాలురు అదృశ్యం అయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ప్రకాశం వీధికి చెందిన నల్లమియ్య అర్హాన్, మౌలానా ఆజాద్ వీధికి చెందిన షేక్ రిహాన్‌లు స్నేహితులు. వీళ్లిద్దరూ సోమవారం ఆడుకోవడానికి బయటికి వెళ్లారు. అయితే ఆ రోజు ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు తిరిగి రాలేదు. పట్టణంలోని పలు ప్రాంతాల్లోనూ. బంధువుల ఊళ్లలో గాలించినా బాలు ర ఆచూకీ తెలియలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు బుధవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.


