స్కూల్‌ బస్‌.. ఫిట్‌ లెస్‌ | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్‌.. ఫిట్‌ లెస్‌

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

స్కూల్‌ బస్‌.. ఫిట్‌ లెస్‌

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: స్కూల్‌ బస్సులు ఫిట్‌నెస్‌ సాధించడంలో ఫెయిలవుతున్నాయి. తనిఖీ చేసిన ప్రతీసారి లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా రవాణాశాఖ అధికారులు పలు స్కూల్‌, కాలేజీ బస్సులు తనిఖీ చేయగా అనేక లోపాలు వెలుగుచూశాయి. లోపాలను గుర్తించిన అధికారులు వాటిని సరిచేయాలంటూ ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. 15 రోజుల్లో ఆ లోపాలను సరి చేస్తేనే మళ్లీ తనిఖీ చేసి ఫిట్‌ నెస్‌ సర్టిఫికెట్‌ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 680 పాఠశాల కళాశాల బస్సులు ఉండగా ఇప్పటివరకు 270 బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు.

గుర్తిస్తున్న లోపాలు ఇవీ......

రవాణా శాఖ తనిఖీల్లో వీఎల్‌టీడీ డివైజ్‌ లు లేకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు బయటకు వచ్చే అత్యవసర ద్వారాలు సరిగా పనిచేయకపోవడం, అత్యవసర ద్వారా వద్ద సీట్లు అమర్చడం వంటి లోపాలు అధికారులు గుర్తించారు. వాటితోపాటు అత్యవసర పరిస్థితులలో ఉపయోగించాల్సిన హ్యమర్లు బస్సులో అందుబాటులో లేకపోవడం, మంటలను ఆర్పే ఫైర్‌ ఎక్విప్‌ మెంట్‌, ఎక్స్‌పైరి డేట్‌ తో ఉండడం వెలుగుచూశాయి.

వీటి పైనే దృష్టి.....

రవాణాశాఖ అధికారులు వారి తనిఖీల్లో ముఖ్యంగా టైర్లు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎక్కే డోర్‌ మెట్లు సక్రమంగా ఉన్నాయా, గ్రిల్స్‌, సీట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌, ఫైర్‌ కిట్‌, వైపర్స్‌, ఇండికేటర్స్‌, హెడ్‌ లైట్స్‌, గ్లాస్‌, బండి కండిషన్‌, రూప్‌ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు విద్యార్థులు బయటకు ఎమర్జెన్సీ సరిగ్గా ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తున్నారు.

నిబంధన పాటించని స్కూల్‌ బస్సులు

రవాణా శాఖ తనిఖీల్లో వెల్లడవుతున్న వాస్తవాలు

Advertisement
 
Advertisement
Advertisement