కలలు.. కల్లలు | - | Sakshi
Sakshi News home page

కలలు.. కల్లలు

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

కలలు.. కల్లలు

తండ్రీ కొడుకుల హయాంలోనే..

బిల్లులు రాక...పనులు సాగక...

బుగ్గవంక అప్రోచ్‌రోడ్ల పరిస్థితి అగమ్య గోచరం

పట్టించుకోని కూటమి ప్రభుత్వం

నిలిచిపోయిన బుగ్గవంక అప్రోచ్‌రోడ్డు పనులు

కడప సిటీ: కడపలోని బుగ్గవంక అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. బుగ్గవంక రక్షణ గోడకు ఇరువైపులా తారురోడ్డు వేయాలని సంకల్పించడమే గాక పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే బుగ్గవంకు ఇరువైపుల తారురోడ్డు వేసి ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు నిధులు మంజూరు చేశారు. పనులు 50 శాతానికి పైగా జరిగాయి.కల సాకారమవుతుందన్న వేళ ఎన్నికలు రావడం, కూటమి సర్కార్‌ అధికారంలోకి రావడంతో ప్రజల కలలు కల్లలుగా మారాయి. కూటమి ప్రభుత్వం ఈ రోడ్ల గురించి పట్టించుకోకపోవడం, సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో అర్ధంతరంగా పనులు ఆగిపోయాయి.

ట్రాఫిక్‌ సమస్య తీరుతుందని..

ప్రధానంగా బుగ్గవంక రక్షణ గోడకు ఇరువైపుల రోడ్డు నిర్మా ణం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే ప్రారంభించారు. అంతేకాకుండా బుగ్గవంక ఆధునీకరణలో భాగంగా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కూడా శ్రీకారం చుట్టారు. 1.2 కిలోమీటర్ల మేర పెండింగ్‌లో ఉన్న ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణాన్ని చేపట్టారు. బుగ్గవంకకు ఇరువైపులా కడపలోని రైల్వే వంతెన నుంచి అల్మాస్‌పేట వరకు ఎనిమిది కిలోమీటర్ల దూరం తారు రోడ్డు నిర్మాణానికి పనులు జరిగాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ప్రొటెక్షన్‌ వాల్‌కు ఇరువైపులా 40 అడుగుల మేర వెడల్పుతో 6.4 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయ్యా యి. వాహనదారులు నేరుగా రైల్వే వంతెన వద్దకు, అల్మాస్‌పేటకు వెళ్లాలన్నా ఈ రోడ్డు ఉపయోగపడుతుందని భావించి పనులు చేపట్టారు. అంతేకాకుండా ఈ రోడ్ల వెంబడి వాహనాలు పోవడం వల్ల నగరంలో రద్దీ తగ్గుతుందని భావించా రు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పెండింగ్‌ పనులను పూర్తి చేయకపోవడంపై కూట మి నేతలకు కడప అభివృద్ధిపై చిత్తశుద్ది లేదన్నట్లు తెలుస్తోంది.

కడప నడిబొడ్డున ఉన్న బుగ్గవంక అభివృద్ధి పనులు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే జరిగాయి. కడపలో బుగ్గవంక కష్టాలు ప్రజలకు తీరని వ్యథగా ఉండేది. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో తాను ముఖ్యమంత్రి అయితే బుగ్గవంక సుందరీకరణ పనులు చేపడతామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే పనులు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బుగ్గవంక వరద ఉధృతితో రవీంద్రనగర్‌, కాగితాలపెంటతోపాటు పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రాణనష్టం జరిగింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ. 49 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2020లో పెండింగ్‌ పనులకు శ్రీకారం చుట్టారు.కూటమి ప్రభుత్వ ఈ రెండేళ్ల పాలనలో బుగ్గవంక ఇరువైపులా ఉన్న రోడ్ల నిర్మాణం పూర్తిగా తారుమారైంది.

నోటీసులు ఇచ్చాం

బుగ్గవంక రక్షణ గోడకు ఇరువైపులా రోడ్ల నిర్మాణ పనులు కొంతమేర చేయాల్సి ఉంది. కానీ సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిపివేశారు. కాంట్రాక్టర్‌కు పనులు ప్రారంభించాలని నోటీసులు ఇచ్చాం. త్వరలో పనులు ప్రారంభించి నిర్మాణ పనులు పూర్తి చేస్తాం.

–చెంగల్రాయుడు, ఈఈ, నీటిపారుదలశాఖ, కడప

Advertisement
 
Advertisement
Advertisement