ప్రతి రైలుల్లో నీటి సమస్య ఉందనేది నిత్యసత్యం. నేను హరిప్రియలో ఇటీవల ప్రయాణిస్తే నీళ్లులేవు. లాంగ్ ట్రైన్స్ అయితే నీళ్లు అయిపోతే, అడిగే నాథుడే లేకుండా పోతున్నాడు. తిరుమల, ఇంటర్‌సిటీ, హరిప్రియ, చైన్నె–ముంబై రైళ్లలో నీటి నిల్వలు ఎప్పుడో అయిపోయింటాయి. నీటి వాడకం లేకపోవడంతో దుర్గంధపూరితంగా మారిపోతున్నాయి. గుత్తి–రేణిగుంట మధ్య అటు చైన్నె, ఇటు ముంబై రైళ్లకు సెంటర్‌పాయింట్‌గా నందలూరులో వాటరింగ్ సౌకర్యం కల్పిస్తే ప్రయాణికులకు నీటి సమస్య తీరుతుంది.
–వేపగుంట శ్యామ్‌రాజ్, సంఘసేవకుడు, నందలూరు రైల్వేకేంద్రం


