కడప అర్బన్ : కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ ఫోరెన్సిక్ మెడిసిన్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ టి.జమున ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్య రంగంలో అత్యంత బాధ్యతాయుతమైన విభాగమన్నారు. ఈ వృత్తిలో నైతిక విలువలు, వృత్తిధర్మాలు, నిజాయితీ, సేవాభావం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఎం.బాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎం.శాంతి, డాక్టర్ అబ్దుల్ ఖాలిద్, డాక్టర్ జి.దినేష్, డాక్టర్ కె.అనుదీప్, డాక్టర్ జి.మౌనిక, డాక్టర్ ఎన్.నవీన్‌వర్ధన్, డాక్టర్ బి.జోనాథన్, డాక్టర్ వై.అరవింద్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


