మిషన్‌లో పడి తెగిపోయిన కాలు | - | Sakshi
Sakshi News home page

మిషన్‌లో పడి తెగిపోయిన కాలు

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

జమ్మలమడుగు: పొలంలో మొక్కజొన్న కోసే యంత్రంలో కాలు పడి అరవ భాస్కర అనే రైతు కాలు సగం వరకు తెగిపోయింది. శుక్రవారం ఉదయం పెద్దముడియం మండల కేంద్రంలో రైతు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త అయిన అరవ భాస్కర్‌ తన పొలంలో మొక్కజొన్న పంట మిషన్‌తో కోయిస్తున్నాడు. అయితే ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి సగానికి కాలు తెగి పోయింది. వెంటనే స్థానికులు అరవ భాస్కర్‌ను నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ,ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డిలు వెంటనే నంద్యాల జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. అనంతరం అరవ భాస్కర్‌కు ధైర్యం చెప్పి అక్కడి వైద్యులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్సీ

Advertisement
 
Advertisement
Advertisement