హాకీ మైదానం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

హాకీ మైదానం పరిశీలన

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

హాకీ మైదానం పరిశీలన

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: కడప మున్సిపల్‌ మైదానంలోని హాకీ గ్రౌండ్‌ (టర్ఫ్‌ పిచ్‌)ను నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ రాకేష్‌ చంద్ర గురువారం పరిశీలించారు. మున్సిపల్‌ మైదానంలో క్రీడాకారులకు అందుతున్న సౌకర్యాలను తనిఖీ చేశారు. మైదాన శుభ్రత, తాగునీరు వంటి అంశాలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన హాకీ గ్రౌండ్‌ను త్వరలో ప్రారంభించే విధంగా చర్య లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా హాకీ మైదానం అందుబాటులోకి రాక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారనే విషయంపై సాక్షి లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. డీఎస్‌డీఓ గౌస్‌ బాషా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement