ట్రాక్టర్‌ బోల్తా – యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా – యువకుడి మృతి

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

బి.కోడూరు : మండలంలోని మాధవరాయునిపల్లె గ్రామానికి చెందిన బి.నాగభూషణం (35) ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లాకు చెందిన నాగభూషణం మండలంలోని మాధవరాయునిపల్లె గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మని వివాహం చేసుకుని అత్తగారింట్లో ఉంటూ కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రామసముద్రం చెరువు నుండి పొలాలకు మట్టి తోలే క్రమంలో అధిక లోడుతో వెళుతూ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ నాగభూషణం అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. బి.కోడూరు ఎస్‌ఐ సూర్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బ్యాంక్‌ రుణాలను వినియోగించుకోవాలి

చాపాడు : రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకులు అందించే వ్యవసాయ, ఇతర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ హెడ్‌ లక్ష్మీ తులసి తెలిపారు. మండల కేంద్రమైన చాపాడులో శుక్రవారం మెగా అగ్రి అవుట్‌ రీచ్‌ ప్రోగ్రాంలో భాగంగా రైతులకు, డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.11కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. తిరుపతి జోనల్‌ ఏజీఎం సనల్‌ కుమార్‌ , మైదుకూరు డివిజన్‌ అగ్రికల్చర్‌ ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ దేవీపద్మలత, ఎల్‌డీఎం జనార్ధ న్‌, డీపీఎం ధనుంజయ, చాపాడు బ్రాంచ్‌ మేనేజర్‌ కేవీ రమణ పాల్గొన్నారు.

ఆటో బోల్తా – డ్రైవర్‌ మృతి

చక్రాయపేట: మండలంలోని సురభి గ్రామం మహబూబ్‌నగర్‌ వద్ద శుక్రవారం రాత్రి పాల ఆటో బోల్తాపడి డ్రైవర్‌ మహబూబ్‌ షరీఫ్‌(28) అక్కడి కక్కడే మృతి చెందాడు.చక్రాయపేట వైపు నుంచి లక్కిరెడ్డిపల్లె వైపు పాలు తీసు కెళుతుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు మహబూబ్‌ షరీఫ్‌ చక్రాయపేట గ్రామం ఉప్పలవాండ్లపల్లె వాసి. మృతుడికి భార్యతో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. చక్రాయపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బండి సంజయ్‌ కుమారుడిని అరెస్టు చేయాలి

ప్రొద్దుటూరు క్రైం : మంత్రి బండి సంజయ్‌ని వెంటనే మంత్రి వర్గం నుండి బర్తరఫ్‌ చేయడంతోపాటు ఆయన కమారుడు బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక శివాలయం సెంటర్‌లో బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోక్సో చట్టం కింద బండి భగీరథ్‌ను అరెస్టు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరస్తున్ని కాపాడుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో రా యలసీమ మహిళా శక్తి కన్వీనర్‌ లక్ష్మీదేవి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయ కుడు శ్రీనివాసులు, విరసం నాయకురాలు వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement