కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ కమి షనర్‌గా రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావనను నియమిస్తూ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. కడప కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రను రిలీవ్ చేశారు. కడప కమిషనర్‌గా భావన వెంటనే బాధ్యతలు స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జమ్మలమడుగు: నారాపుర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. రకరకాల పూలు ఒక్కచోటకు చేరి స్వామి సన్నిధి లో కొలువుదీరాయి. వేదపండితులు నారాపురస్వామికి ప్రత్యేక అలంకారం నిర్వహించారు. పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా యువతకు నైపుణ్య నిధిగా, రాష్ట్రానికే స్ఫూర్తిగా రూపుదిద్దుకుంటున్న ‘స్టార్ట్ అప్ కడప‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ అతి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కడప నగరంలోని ిపీ4 విధానం ద్వారా ఇన్నోవేటీవ్ గా నిర్మిస్తున్న ‘స్టార్ట్ అప్ కడప‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని కడప నగర నూతన కమిషనర్ భావనతో కలిసి పరిశీలించారు. బాహ్య నిర్మాణ పనులను పూర్తిగా వారంలోగా కంప్లీట్ చేయాలన్నారు. స్టార్టప్ కడప’’కేవలం ఒక భవనం మాత్రమే కాదని.. ఇది యువత కలలకు రూపురేఖలు ఇచ్చే వేదిక అన్నారు. ఆవిష్కరణ, ఆధునికత, అభివృద్ధికి దిక్సూచిగా నిలవనుందన్నారు.


