పోరుమామిళ్ల: కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజల్, వంటగ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ శనివారం పోరుమామిళ్లలో సీపీఐ నాయకులు అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చొని, గ్యాస్ సిలెండర్లు నెత్తిన పెట్టుకుని ఆంధోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మోడీ ప్రభుత్వం పెట్రో ధరల భారం కానుకగా ఇచ్చిందన్నారు. తక్షణమే పెంచిన ధరలు ఉపసంహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కేశవ, జాకోబ్, ప్రసాద్, సఫా, పీరయ్య, నరసింహులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.


