ఇకపై ఉదయమే ‘ములాఖత్‌’ | - | Sakshi
Sakshi News home page

ఇకపై ఉదయమే ‘ములాఖత్‌’

May 12 2026 5:30 AM | Updated on May 12 2026 5:30 AM

ఇకపై ఉదయమే ‘ములాఖత్‌’ గండిలో శ్రీమద్రామాయణ మహా యజ్ఞం

కడప అర్బన్‌: రాష్ట్ర జైలు శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ములాఖత్‌కు అవకాశం ఉంటుందని కడప కేంద్రకారాగారం సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండుటెండల నుంచి రక్షణ పొందడానికి వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ములాఖత్‌కు వచ్చే వారు మారిన సమయాన్ని గుర్తించి, అధికారులకు సహకరించాలని కోరారు.

చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి నూతన ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా నాలుగోరోజు సోమవారం పలు కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు.ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ మహాయజ్ఙం, తుంబూర వేషాలంకారంతో పాటు నాగవళ్లి దళాలతో(తమలపాకులతో) సహస్ర నామార్చన నిర్వహించారు.అనంతరం శాత్తమొరై జరిపారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement