రైలు వేళలు
రాజంపేట: ఉమ్మడి జిల్లా కేంద్రం కడప మీదుగా తమిళనాడులోని కావేరీ నది తీరాన వెలసిన భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథస్వామి ఆలయానికి భక్తులు వెళ్లే అవకాశం కలిగింది. అరుణాచలం, వేలూరు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు త్వరలో రైలు అందుబాటులోకి రానుంది. అదే గుంటూరు(1726/ 17262)–తిరుపతి మధ్య నడిచే రైలు. ఈ రైలును తిరుచిరాపల్లె వరకు పొడిగించడం వల్ల భఽక్తులకు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది.
తమిళనాడులోని పుణ్యక్షేత్రాలు..
భక్తులు గుంటూరు–తిరుపతి రైలులో వెళ్లి తమిళనాడులోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. వేలూరులో గోల్డెన్ టెంపుల్(శ్రీపురం మహాలక్ష్మీ ఆలయం), తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. కాణిపాకంకు వెళ్లేందుకు ఈ రైలు దోహదపడుతుంది.
హాల్టింగ్స్ ఇవే..
నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్‌ఐ, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఎర్రగుంట్ల, కమలాపురం, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి.. అక్కడి నుంచి పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు, అరణిరోడ్డు, పోలూరు, తిరవణ్ణామలై(అరుణచాలం), తిరుక్కోవైలూరు, విల్లుపురం, అరియాలూరు, శ్రీరంగం మీదుగా తిరుచ్చి(తిరుచిరాపల్లె)కు చేరుకుంటుంది.
మూడేళ్లుగా...
మూడేళ్లుగా వైఎస్సార్ కడప,నంద్యాల, తిరుపతి జిల్లా పరిధిలోని భక్తులకు నేరుగా అరుణాచలం వెళ్లేందుకు రైలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా చేరుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరు–తిరుపతి ౖరైలును తిరుచిరాపల్లెకు వరకు పొడిగించేందుకు రైల్వేబోర్డు ఆమోదం లభించిందని రైల్వేవర్గాలు స్పష్టీకరించాయి.
ఎంపీ మిథున్‌రెడ్డి కృషి ఫలితం...
ఉభయ జిల్లాల వారు అరుణాచలం, శ్రీరంగం, వేలూరు వెళ్లేందుకు రైలు నడపాలని రైల్వేమంత్రిని ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. భక్తులు తిరుపతి, రేణిగుంటకు వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తోందని దీంతో ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. ఎంపీ వినతి మేరకు రైల్వేమంత్రిత్త్వశాఖ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో తిరుపతి–గుంటూరు మధ్య నడుస్తున్న గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలును తిరుచిరాపల్లె వరకు పొడిగించారు. అయితే ఈ రైలు వెళ్లే సమయం కడప, రాజంపేట,నందలూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు , రైల్వేకోడూరు వాసులకు ఉపయోగకరంగా లేదు. ఉదాహరణకు రాజంపేటకు రాత్రి 8.50గంటలకు వచ్చే గుంటూరు–తిరుపతి రైలు ఇప్పుడు తెల్లవారుజామున 2 గంటలకు వస్తుంది. ఉదయం 11.20 నిమిషాలకు గుంటూరుకు చేరుకుంటుంది. దీనివల్ల అమరావతికి నేరుగా వెళ్లే సౌకర్యం ప్రయాణికులు కోల్పోయారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు స్పందించి, సమయాల్లో మార్పులకు ప్రయత్నించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
గుంటూరు–తిరుపతి మధ్య నడిచే రైలు
కడప మీదుగా.. శ్రీరంగం, అరుణాచలం, వేలూరుకు రైలు!
గుంటూరు–తిరుపతి రైలు పొడిగింపు
గుంటూరు(17261)లో..సాయంత్రం 4గంటలకు బయలుదేరుతుంది.మరుసటి రోజు మధ్యాహ్నాం 2గంటలకు చేరుకుంటుంది.
తిరుచిరాపల్లె(17262)లో సాయంత్రం 4గంటలకు బయలుదేరుతుంది. తిరుపతికి రాత్రి 11.40 గంటలకు, కడపకు 2.45కు, గుంటూరుకు మరుసటి రోజు 11.20గంటలకు చేరుకుంటుంది.


