భక్తులకు సౌకర్యం | - | Sakshi
Sakshi News home page

భక్తులకు సౌకర్యం

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

అరుణచాలం వెళ్లేందుకు ఉమ్మడి కడప జిల్లా వాసులకు గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు సౌకర్యంగా ఉంటుంది. అరుణాచలానికి డైరెక్ట్‌ కనెక్టివిటీ రైలు కోసం రైల్వేమంత్రిని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినివైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారు. ఎంపీ చేసిన ప్రయత్నం ఫలించింది. – తల్లెంభరత్‌కుమార్‌రెడ్డి,

డీఆర్‌యుసీసీ, తిరుపతి జిల్లా

పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు

తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు దోహదపడుతుంది. రైళ్లు మారకుండా నేరుగా కాణిపాకం, వేలూరు, అరుణచాలం, శ్రీరంగం వెళ్లేందుకు వీలవుతుంది. అయితే మరోవైపు రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు రైలు దోహదపడదనే భావన ఉంది. రైల్వేశాఖ విజయవాడకు కడప మీదుగా వెళ్లేలా రైలు తీసుకురావాలి. –దాసరి నరసింహులు,

సీనియర్‌న్యాయవాది, నందలూరు

Advertisement
 
Advertisement
Advertisement