ప్రొద్దుటూరు : పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని స్థానిక పాత బస్టాండ్ వద్ద శనివారం ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందని విమర్శించారు. ప్రధాని మోదీ పెట్రోలు, డీజిల్ కొరత ఉందని, సైకిల్, ఎద్దుల బండ్లపై, నడుచుకుంటూ పాత రోజులు గుర్తు చేసుకుని ప్రయాణం చేయండి అని ఉచిత సలహా ఇవ్వడం ఎంత వరకు సమంజమన్నారు. సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు పక్కీరయ్య, సర్వేశ్వరి, బాలసుబ్బయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.


