ఏపీ ఈఏపీ సెట్‌కు 92.99 శాతం హాజరు | - | Sakshi
Sakshi News home page

ఏపీ ఈఏపీ సెట్‌కు 92.99 శాతం హాజరు

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

ఏపీ ఈఏపీ సెట్‌కు 92.99 శాతం హాజరు హుండీ ఆదాయం లెక్కింపు బ్రహ్మంగారి హుండీ ఆదాయం రూ.40.30 లక్షలు 20న మెడికల్‌ షాపుల బంద్‌ ఉత్సాహంగా క్రికెట్‌ ఎంపికలు

కడప ఎడ్యుకేషన్‌: ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి గురువారం రెండు సెషన్స్‌లో నిర్వహించిన ఇంజనీరింగ్‌ అండ్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 92.99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలలో కలిసి 9 పరీక్షా కేంద్రాలకుగాను ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌కు సంబంధించి 1569 మంది అభ్యర్థులకుగాను 1459 మంది హాజరుకాగా 110 మంది గైర్హాజరయ్యారు.

ఒంటిమిట్ట (సిద్దవటం): మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి హుండీ ఆదాయాన్ని గురువారం టీటీడీ అధికారులు లెక్కించారు. ఈ సందర్భంగా నెల రోజులకుగాను భక్తులు వేసిన కానుకలను లెక్కించగా రూ.7,72,930ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో భక్తులు సమర్పించుకున్న హుండీల సొమ్మును గురువారం లెక్కించారు. ఇందులో బ్రహ్మంగారిమఠంలో హుండీల ద్వారా రూ. 37,55,769 , పోలేరమ్మ గుడి దగ్గర గల హుండీ ద్వారా రూ. 2,74,699 లక్షలు. నాలుగు గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి వచ్చినట్లు మేనేజర్‌ ఈశ్వరాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్‌ అధికారి శంకర్‌ బాలాజీ, మఠాధిపతి వీర ధర్మజ వెంకటాద్రి స్వామి, మఠం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

కడప రూరల్‌: ఫార్మసీ రంగంలో నియంత్రణ లేని కార్యకలాపాలకు నిరసనగా ఆల్‌ ఇండియా కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులను బంద్‌ చేస్తున్నట్లు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకుపైగా కెమిస్టులు, నియంత్రణ లేని ఆన్‌లైన్‌ కార్యకలాపాలతో పాటు, అన్యాయంగా డిస్కౌంట్‌ విధానాల కారణంగా కమ్యూనిటీ ఫార్మసీ వ్యవస్థ ప్రమాదంలో పడిందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా 20న చేపట్టే దేశవ్యాప్త బంద్‌ కు సహకరించి, మద్దతు తెలపాలన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, సెక్రెటరీ వెంకటేశ్వర్లు, ట్రెజరీ సుబ్బారావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కేశవరెడ్డి, ప్రొద్దుటూరు జోన్‌ సెక్రటరీ సుబ్బారావు, పులివెందుల జోన్‌ సెక్రెటరీ దినేష్‌ కుమార్‌, కడప జోన్‌ సెక్రెటరీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: నగర శివార్లలోని వైఎస్సార్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో అండర్‌ –16, 14 క్రికెట్‌ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఏ.రెడ్డి ప్రసాద్‌ తెలిపారు. ఈ ఎంపికలకు అండర్‌ 16 బాలుర విభాగంలో సుమారు 290 మంది, అండర్‌ 14 విభాగంలో 300 మంది క్రీడాకారు లు పాల్గొన్నట్లు తెలిపారు. ఇందులో ఎంపిక చేసిన వారితో సెలక్షన్‌ మ్యాచులు నిర్వహిస్తా మని పేర్కొన్నారు. అనంతరం జిల్లా జట్టును ఎంపిక చేస్తామని వివరించారు. ఈ ఎంపికలను జిల్లా క్రికెట్‌ సంఘ అధ్యక్షుడు ఎల్‌.మణికుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. సభ్యులు బి.ఈశ్వర్‌ రెడ్డి,ఎం మహేంద్ర రెడ్డి, కే విష్ణు మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement