ఓబులవారిపల్లె మండలానికి చెందిన కోటకొండ సుబ్బమ్మ (56) రాజంపేటలో జరిగే పెళ్లికి శుక్రవారం బయలుదేరింది. తిరుపతి నుంచి తాడిపత్రికి వెళుతున్న కారులో ఓబులవారిపల్లె మండలం వడ్డెపల్లెకు చెందిన మహాలక్ష్మీ ,జీ.ప్రసాద్, శివయ్య, వెంకటసుబ్బమ్మ, ఏరుకులమ్మలు కారులో ఉన్నారని పోలీసులు తెలిపారు. రాజంపేట మండలం వెంకటరాజంపేట వద్ద కారును ఎదురుగా కడప నుంచి ఓబులవారిపల్లెకు వెళుతున్న సిమెంట్‌లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో కోటకొండ సుబ్బమ్మ మృతి చెందింది. స్ధానికులు కారులో ఉన్నవారిని బయటికి తీశారు. స్ధానికులు 108కు ఫోన్ సమాచారం ఇచ్చారు. గంటసేపటి వరకు రాలేదని ఆ గ్రామానికి చెందిన పూలభాస్కర్ విమర్శించారు.


