విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

May 13 2026 1:32 AM | Updated on May 13 2026 1:32 AM

విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

మదనపల్లె సిటీ: విద్యార్థి దశ నుంచే క్రీడలపట్ల ఆసక్తి పెంచుకోవాలని డీఎస్‌డీఓ చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం స్థానిక బెంగుళూరు రోడ్డులోని గురు హాకీ క్లబ్‌ వేసవి శిబిరాన్ని సందర్శించారు. వేసవి శిబిరంలో శిక్షణలో మెళుకువలు నేర్చుకోవాలన్నారు. హాకీ క్రీడకు మదనపల్లెలో మంచి గుర్తింపు ఉందన్నారు. ఎంతో మంది జాతీయ,రాష్ట్ర స్థాయిలో రాణించారన్నారు. హాకీ పితామహుడు ధ్యాన్‌చంద్‌ మదనపల్లెలో హాకీ క్రీడను క్రీడాకారులను నేర్పించారన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ కోచ్‌ గురుభాస్కర్‌,పి.ప్రసాదరెడ్డి, కోచ్‌లు నౌషాద్‌,గౌస్‌, విష్ణు, సుల్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement