వైఎస్సార్‌సీపీ సోషియల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సోషియల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసు

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 8:38 AM

లక్కిరెడ్డిపల్లి : అన్నమయ్య జిల్లా అప్పకొండయ్యగారిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ సోషియల్‌ మీడియా కార్యకర్త లక్ష్మీరెడ్డిపై గిద్దలూరు పోలీసు స్టేషన్‌లో అక్రమంగా కేసు బనాయించి విచారణ నిమిత్తం విశాఖపట్నం నుంచి గిద్దలూరుకు తీసుకొచ్చి రాత్రంతా పోలీసు స్టేషన్‌లో పెట్టినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం జనసేన పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో లక్కిరెడ్డిపల్లి మండలంలోని అప్పకొండయ్యగారిపల్లికు వచ్చిన గిద్దలూరు పోలీసులు విచారణ నిమిత్తం లక్ష్మీరెడ్డి సోదరుడుని విచారించి విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకుంటున్న లక్ష్మీరెడ్డిని శనివారం అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు సుదర్శన్‌ రెడ్డి ఆదేశానుసారం గిద్దలూరు నియోజకవర్గ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు కాకునూరి హిమశేఖర్‌ రెడ్డి ఆదివారం బాధిత వ్యక్తులకు బెయిల్‌ ఇప్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement